మాజీ సీఎం, రాజంపేట కూటమి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డిని స్థానిక టీడీపీ నేతలు కలిశారు. మదనపల్లె మండలం గంగన్నగారిపల్లెకు చెందిన టీడీపీ నేత గంగారపు బాబురెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కలికిరికి వెళ్లి కిరణ్‌కుమార్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మిమ్మ ల్ని..తామంతా కలసికట్టుగా గెలిపించుకుంటామని ఆయనకు హామీ ఇచ్చారు. మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.షాజహానబాషాతో కలసి..మీ విజయానికి ఇంటింటా ప్రచారం చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నట్లు బాబురెడ్డి పేర్కొన్నారు. పుష్పగుచ్చం అందజేసి దుశ్సాలువతో సన్మానించారు. ఇందులో టీడీపీ నాయకులు నాదెళ్ల వైట్ అండ్ వైట్ రామన్న, నారాయణస్వామి, రమేష్, దేవుడు రమేష్, గ్రామకమిటీ అధ్యక్షుడు నటశేఖర్ పాల్గొన్నారు.