అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. టెక్సాస్, కాన్సాస్ వంటి పలు రాష్ట్రాల్లోని డైరీ ఫామ్‌లోని ఆవుల్లో, వాటి పాలల్లో.. అలాగే పౌల్ట్రీలోని కోళ్లల్లో బర్డ్ ఫ్లూ ఉన్నట్టు మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలోని వెటర్నరీ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ వెల్లడించింది. దీంతో రాష్ట్ర ఆరోగ్య అధికారులు టెక్సాస్ ప్లాంట్‌లో కోళ్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. అంతేగాకుండా మార్కెట్లో చికెన్, గుడ్లను కూడా ఆపేశారు.