మరోసారి జగనన్నకి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని, 58నెలల పాలనలో సాహసోపేతమైన సంక్షేమ పథకాలను అమలుచేసి అర్హులైన ప్రతి ఒక్కరికి అందించిన ఘనత జగనన్నకు దక్కుతుందనివైసిపి నేతలు ఉమామహేశ్వరనాయుడు, బోయ తిప్పేస్వామి అన్నారు. బుధవారం కళ్యాణదుర్గం పట్టణంలోని 13వ వార్డు వడ్డెర కాలనీలో పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్ధి తలారి రంగయ్యకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.