ఎన్నికల కమిషన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య బుధవారం లేఖ రాశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను ప్రభుత్వం పాటించకుండా పెన్షన్ దారులను సచివాలయంకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పడం దుర్మార్గమైన రాజకీయ కుట్ర అని అన్నారు. పేదలపై ప్రభుత్వం కక్ష అని.. దీనికి అధికారులు వత్తాసు పలకడం దుర్మార్గమని అన్నారు. ఇప్పటికీ నగదు సచివాలయంలోకి అందలేదన్నారు. వైసీపీ కార్యకర్తలు మంచంపై వృద్ధులను మోసుకువస్తూ.. ఈసీ ఆదేశాలను ధిక్కరిస్తుంటే అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే నగదు విడుదల చేసి ఇళ్ళ వద్ద పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోందన్నారు. లబ్ధిదారులకు జరిగే కష్ట నష్టాలకు ప్రభుత్వానిదే భాధ్యత అని వర్ల రామయ్య అన్నారు.