దేశంలో అవినీతి లేని పాలన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే సాధ్యమని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం నాడు మదనపల్లెలో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ... సీఏఏ యాక్ట్ భారతీయులకు వర్తించదని.. పాకిస్థాన్, ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేష్ వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పారు. దేశంలోని ముస్లింలకు సీఏఏ వల్ల నష్టం జరగదని వివరించారు. ఓట్లకోసం వైసీపీ ముస్లింలను రెచ్చగొడుతోందని మండిపడ్డారు. ఎన్ఆర్సీ వల్ల దేశ పౌరులకు నష్టం జరగదన్నారు. తాను సీఎంగా ఉన్నపుడు మైనార్టీల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశానని తెలిపారు. బాబ్రీ మసీదు స్థల వివాదంలో హిందూ దేవాలయానికి 2.74 స్థలం ఇస్తే, ముస్లిం మసీదు కోసం 5 ఎకరాల స్థలం కేటాయించారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకం కాదని అన్నారు. 6 ఇస్లామిక్ దేశాల్లో ప్రధాని మోడీకి గొప్ప అవార్డులు ఇచ్చాయని గుర్తు చేశారు. పదేళ్లు ఎంపీగా ఉన్న మిథున్‌రెడ్డి ఇసుక, లిక్కర్‌తో రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారని ధ్వజమెత్తారు. మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. మదనపల్లి అభివృద్ధికి కృషి చేస్తానని నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.