ఎన్టీఆర్ జిల్లా, నందిగామలో వైసీపీ దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఆంధ్ర హస్పటల్లో మాజీ మంత్రి దేవినేని ఉమా పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నందిగామలో వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రోద్భలంతోనే ప్రజలు, టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు. వసూల్ బ్రదర్స్ దుర్మార్గాలను ఎదిరించి తంగిరాల సౌమ్య వీరోచితంగా పోరాడుతున్నారన్నారు. నల్లాని కిషోర్, నరసింహారావుల ఇంటికి మొండితోక జగన్మోహన్రావు ప్రచారానికి వచ్చి.. వారిపై వైసీపీ నాయకులు రాడ్లతో ఇటుకలు, కర్రలతో దాడి చేయడం అమానుషమని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంలో కూడా కొంతమంది అధికారులను అడ్డుపెట్టుకొని ఇటువంటి దాడులు చేయడం దుర్మార్గమన్నారు. మొండితోక బ్రదర్స్ దాడులు దౌర్జన్యాలతో భయాందోళన సృష్టిస్తున్నారన్నారు.