పాలకుడు అంటే ప్రజలను పరిపాలించే వాడు కాదు, ప్రజల సంక్షేమాన్ని చూసుకునే వ్యక్తి అని చెప్పి అధికార పీఠానికి కొత్తభాష్యం చెప్పిన ఆదర్శమూర్తిగా నిలిచిన నాయకుడు మన సీఎం వైయస్ జగన్ అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్ తెలిపారు. అయన మాట్లాడుతూ.... ఒక సాధారణ డాక్టర్ అయిన నాకు రాజకీయ అవకాశం కల్పించి నాపై నమ్మకం ఉంచి రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్ధిగా అవకాశం ఇచ్చినందుకు సభాముఖంగా సీఎం వైయస్ జగన్ కు నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. పూతలపట్టు నియోజకవర్గం కరువు ప్రాంతం, వర్షాభావ ప్రాంతం కాబట్టి మిమ్మల్ని అభిమానించే ప్రజానీకం ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మళ్లీ మీరు ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి మా అందరి కోరిక. రామరాజ్యం ఎలా ఉంటుందో మేము చూడలేదు కానీ, రామరాజ్యంలాంటి రాజన్నబిడ్డ రాజ్యం ఎలా ఉంటుందో ఈ తరానికి చూపిస్తున్న నాయకుడు మన సీఎం వైయస్ జగన్ అని గర్వంగా చెప్పగలుగుతాను. నామీద నమ్మకంతో మీరు ఆశీర్వదించి నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మంచి పరిపాలన దిశగా ఐదు సంవత్సరాలు మంచి పరిపాలన చూశాం. మళ్లీ ముఖ్యమంత్రిగా అన్న రావాలి, మనందరికీ కూడా మంచి చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.