మీరు వేసే ఓటు వల్ల రాష్ట్ర భవిష్యత్, మన తలరాతలు మారుతాయని ఆలోచించుకోవాలని వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రేపు జరిగే ఎన్నికలు జగన్కు, చంద్రబాబుకు జరుగుతున్న యుద్ధం కాదు.. ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ యుద్ధంలో నేను ప్రజలపక్షాన ఉన్నానన్నారు. మంచి వైపున నిలబడి యుద్ధం చేయడానికి మీరంతా సిద్ధమా?. ప్రజలిచ్చిన అధికారంతో ప్రతి ఇంటికి మంచి చేశాం. ఒక వైపు విశ్వసనీయత, మరో వైపు మోసం.. నిజం ఒక వైపు, అబద్ధం మరో వైపు ఉన్నాయి. అబద్ధం, మోసం, అన్యాయం, తిరగోమనం, చీకటిని రిటర్న్ గిప్ట్గా ఇచ్చిన చంద్రబాబు మనముందే ఉన్నారు. ఒక్కడి పోరాటానికి ఇంతమంది వస్తున్నారు. ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీల ఏకమవుతున్నాయి. కుట్రలు, కుంతంత్రాలు చేస్తున్నాయి.. ప్రత్యేకహోదా ఇవ్వని పార్టీ, హోదాలను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే. జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రం ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు.