మంత్రి జోగి రమేష్ ఓ జోకర్ అని, పిచ్చి పిచ్చి వేషాలేస్తే బట్టలూడదీసి తంతామని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న హెచ్చరించారు. చంద్రబాబు ఇంటికి వెళ్తానని, ధర్నా చేస్తానని జోగి రమేష్ ప్రగల్భాలు పలుకుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పెనమలూరులో వృద్ధురాలు ఘటనకు నిరసనగా చంద్రబాబు ఇంటి వద్ద ధర్నా చేస్తానని మంత్రి జోగి రమేష్ అన్నారు. దీంతో చంద్రబాబు నివాసం వద్ద పెద్ద సంఖ్యలోమంగళగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకున్న బుద్ధా వెంకన్న చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు.