నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరనున్నారు. హైదరాబాద్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో ఆయన మంగళవారం ఆయన భేటీ అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ నుంచి గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ర్యాలీగా తాడేపల్లిగూడెం – యండగండి – గొల్లలకోడేరు మీదుగా భీమవరం చేరుకుంటారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జి నేతృత్వంలో రఘురామకు ఘన స్వాగతం పలకనున్నారు. భీమవరంలో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటారు. నరసాపురం, పాలకొల్లుల్లో 5, 6 తేదీల్లో జరిగే ప్రజాగళం సభల్లో ఆయన పాల్గొంటారు. రానున్న ఎన్నికల్లో పోటీలో ఉంటారంటూ ఎంపీ అనుచర వర్గం ధీమాతో ఉంది. ఎక్కడ నుంచి ఏ స్థానానికి పోటీ చేస్తారనే విషయమై సస్పెన్స్ నెలకొంది.