టిప్పర్ డ్రైవర్ రామాంజనేయులును చట్టసభలో కూర్చోబెట్టేందుకే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సింగనమల అసెంబ్లీ టికెట్ ఇచ్చానని పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శింగనమల నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా నిలబెడుతున్నాం. నాకు ఈ ప్రస్తావన వచ్చినప్పుడు శింగనమల నియోజకవర్గం నుంచి ఈ మాదిరిగా ఒక టిప్పర్ డ్రైవర్ ను మనం అసెంబ్లీకి నిలబెట్టే కార్యక్రమం చేస్తే బాగుంటుందని, ఒక అభ్యర్ధి ఉన్నాడు అని నా దగ్గరకు ప్రస్తావన వచ్చినప్పుడు నిజంగా నేను అనుకున్నాను.. ఆ అభ్యర్ధి ఎవరు? ఆ అభ్యర్ధికి సంబంధించిన చదువులేమిటి? అని అడిగాను. చదువు విషయానికి వచ్చే సరికే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వీరాంజనేయులు అనే వ్యక్తి, ఆ మనిషి.. మన పార్టీకి కార్యకర్తగా చాలా సంవత్సరాలుగా ఉన్నాడు. కార్యకర్తగా ఉంటూనే తాను ఎంఏ చదివి, ఎంఏతోనే చదువు సరిపెట్టకుండా ఏకంగా ఎంఏ ఎకనామిక్స్, ఆ తర్వాత బీఈడీ కూడా పూర్తి చేసిన పరిస్థితిలో ఆ అభ్యర్ధి ఉన్నాడు. అంత గొప్ప చదువులు చదివి కూడా టిప్పర్ డ్రైవర్ గా తన కాళ్ల మీద తాను నిలబడ్డారు. కారణం ఏంటంటే తాను ఉద్యోగం రావడం లేదని చెప్పి తాను బాధపడలేదు. చంద్రబాబు హయాంలో తనకు ఉద్యోగం దొరక్కపోయినా కూడా తాను బాధపడలేదు. తాను టిప్పర్ డ్రైవర్ గా అయినా సరే తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎటువంటి ఇబ్బంది కూడా పడకుండా తన కుటుంబాన్ని పోషించడం మొదలు పెట్టాడు.అటువంటి వ్యక్తిని ఎవరైనా కూడా భుజం తట్టి శభాష్ అని చెప్పి అనాల్సింది. అటువంటి వీరాంజనేయులును, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ చదివి, బీఈడీ చదివి టిప్పర్ డ్రైవర్ గా తన జీవితం కొనసాగుతున్న ఆ వీరాంజనేయులును, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈరోజు మీ అందరి ప్రతినిధిగా నిలబెడుతున్నాం. మీ అందరి ప్రతినిధిగా, మీ అందరికీ తోడుగా ఉంటూ మీ సమస్యలను కూడా చట్టసభల్లో లేవనెత్తడానికి మీ తరఫున మీ సోదరుడిగా చట్టసభలో ఉండేందుకు నిలబెడుతున్నాను అని తెలియజేసారు.