మరిది చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసం పోలీసు అధికారులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపణలు చేశారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు నాయుడిని కాపాడేందుకు బీజేపీ నాయకులు పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారని ఆయన ధ్వజమెత్తారు. పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కంటే చెల్లెలి భర్తకు మేలు చేసేలా పని చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ను కూలదోసే సమయంలో బాబుకు పురంధేశ్వరి సపోర్టు చేశారని దుయ్యబట్టారు. బాబు కోసం పురంధ్వేశ్వరి బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారని విమర్శించారు.