ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. వరుసగా రెండో ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన జట్టు ఆటగాళ్లను ప్రశంసించారు. పిచ్ పరిస్థితులే ఓటమికి కారణమని, బౌన్స్ ఒకేలా లేకపోవడం వల్ల బ్యాటింగ్‌కు కష్టమైందని ఆయన పేర్కొన్నారు. పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోయినా 160 దాటడం ఆటగాళ్ల కృషి అని, ఆఖరి ఓవర్ వరకు పోరాడటం తమ పట్టుదలకు నిదర్శనమని అయ్యర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa