శ్రీసత్యసాయి జిల్లా రోల్ల మండలం హొట్టే బెట్ట గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడబ్ల్యుసి మెంబెర్ రఘువీర పాల్గొన్నారు. రఘువీరా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధాకర్ కు ప్రతి ఒక్కరు ఓటు వేసి రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.