జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ జి. వీరరాఘవరెడ్డి పర్యవేక్షణలో టూటౌన్ సీఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఎస్సై రుసింద్ర బాబు, పోలీసు సిబ్బంది స్థానిక నాయక్ నగర్ రైల్వే గేటు సమీపంలో శనివారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అనంతపురానికి చెందిన సురేష్ కుమార్ రెడ్డి ఎలాంటి ఆధారాలు లేకుండా రూ. 2 లక్షల నగదు తీసుకెళ్తుండగా టూటౌన్ పోలీసులతో పాటు ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం, వీడియో సర్వేలెన్స్ టీం (VST) బృందాలు తనిఖీలు చేపట్టి రూ. 2 లక్షల నగదు సీజ్ చేసి అనంతపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించారు.