ధర్మవరం పట్టణం గుడ్ షెడ్ కొట్టాలకు చెందిన లింగమయ్య అనే వ్యక్తి శుక్రవారం ఎర్రగుంట సర్కిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. లింగమయ్య తుంపర్తి కాలనీకి వెళ్తున్న క్రమంలో ఎర్రగుంట సర్కిల్ వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ లింగమయ్య ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో గాయపడ్డాడు బాధితుడిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.