చిలమత్తూరు మండలంలోని సుబ్బారావు పేట గ్రామానికి చెందిన కలీమూన్(42) అనే మహిళా శనివారం విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందింది. కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు వాషింగ్ మిషన్ స్విచ్ ఆన్ చేయడానికి వెళ్లగా విద్యుత్ షాక్ తో స్పృహ కోల్పోయింది గమనించి చిలమత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మండల అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, నాయకులు వారిని పరామర్శించారు.