రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఉమ్మడి కార్యాచరణతో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు ముందుకు వెళ్లాలని రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి చెరుకుపల్లిలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జనసేన నాయకులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ దుర్మార్గపు పాలన అంతమొందించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి ఎనలేనిది అన్నారు.