హనుమంతునిపాడు మండలం వేములపాడు గ్రామాన్ని ఎన్నికల్లో భాగంగా కనిగిరి సీఐ వెంకటేశ్వరరావు సందర్శించారు. ఆదివారం గ్రామస్థులతో సీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు హక్కును ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు పోకుండా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హనుమంతునిపాడు ఎస్సై శివ నాగరాజు, పోలీసు సిబ్బంది, స్థానిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు.