శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ మండలం జడ్పిటిసి గుట్టూరు శ్రీరాములు గుండెపోటుతో సోమవారం మృతి చెందారు. అయన మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు శ్రీరాములు మృతి పట్ల నివాళులర్పిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు.