ఆత్మకూరు మండలం పాపంపల్లిలో సోమవారం రైతు శ్రీనాథ్ రెడ్డికి చెందిన గడ్డివాముకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటల్లో గడ్డివాము దగ్ధమైంది. స్థానికులు గమనించి రైతు శ్రీనాథ్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. అతడు స్థానికుల సాయంతో మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. అనంతరం అగ్ని మాపక సిబ్బంది కూడా మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా గడ్డివాము దగ్ధమైంది. పోలీసులు కేసు నమోదు చేశారు.