నిజాంపట్నం మండలంలో టిడిపికి చెందిన 20 కుటుంబాలు సోమవారం నిజాంపట్నం ఎంపీపీ మోపిదేవి విజయనిర్మల హరినాథ్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం వీరికి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, రేపల్లె వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గణేష్ లు పార్టీ కండువా కప్పి సాధారణంగా వైసీపీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని వారు తెలిపారు.