చీరాలలోని పేరాలలో గల ఆంధ్ర రత్న మున్సిపల్ హైస్కూల్ లో శరీరం డీ హైడ్రేట్ కాకుండా వాటర్ బెల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా వడగాల్పులు వీస్తున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలనీ,డీ హైడ్రేషన్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ ఇస్తున్నట్లు చెప్పారు.రోజూ ఉదయం 8. 45 గంటలకు, 10. 50 గంటలకు,11. 50 గంటలకు వాటర్ బెల్ మోగిస్తామని ఈ సమయంలో నీళ్లు తాగేందుకు బ్రేక్ ఉంటుందని తెలిపారు