మండవల్లిలోని 1, 2 వార్డుల్లో సోమవారం గుడ్ మార్నింగ్ మండవల్లి కార్యక్రమంలో కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రజలకు శుభోదయం తెలుపుతూ ముందుకు సాగారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలాంటి అవినీతికి తావులేకుండా ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ ని మళ్లీ సీఎం గా గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి మళ్లీ వైసీపీని గెలిపించాలని కోరారు.