ఇందుకూరుపేట మండలంలోని కల్తీ కాలనీలో సోమవారం ఉదయం టిడిపి నేతలు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోవూరు టిడిపి అసెంబ్లీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి విచ్చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.