కడప నగరం చిన్నచౌకు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి సోమవారం చిన్నచౌకు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో పోలీసులు కవాతు నిర్వహించారు. సి. ఐ నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో దేవుని కడప, పాత కడప, ఎస్. సి కాలనీ, మోడమీది పల్లిలో ప్లాగ్ మార్చ్ కొనసాగింది.