చీరాలలో ప్రధాన రాజకీయ పార్టీలు రెండూ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న చేనేతలకు టిక్కెట్లు ఇవ్వని నేపథ్యంలో ఈనెల 11న సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తామని జాతీయ చేనేత ఐక్యవేదిక అధ్యక్షుడు అండగుండ నారాయణ తెలిపారు. ఆదివారం రాత్రి చీరాలలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో రానున్న ఎన్నికల్లో చేనేతల పాత్ర అనే అంశంపై జరిగిన సదస్సులో ఈ మేరకు తీర్మానం చేశారు. చేనేతలను విస్మరించడాన్ని గర్హించారు.