ప్రకాశం జిల్లా కొండేపి పొగాకు వేలం కేంద్రంలో సోమవారం నుంచి మూడో రౌండ్ పొగాకు వేలం ప్రారంభిస్తున్నట్లు స్ధానిక వేలం నిర్వహణాధికారి జి సునీల్ కుమార్ తెలిపారు. సోమవారం స్ధానిక పొగాకు వేలం కేంద్రంలో ఆయన మాట్లాడుతూ బోర్డు పరిధిలోని గ్రామాలకు కేటాయించిన తేదీల్లో ఒక్కో బ్యారన కు 4 బేళ్లు మాత్రమే వేలానికి తీసుకురావాలని స్పష్టం చేశారు. పొగాకు గేడింగ్ లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు.