బెస్తవారిపేట పట్టణ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై సోమవారం కారు బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న కారు డ్రైవరు తీవ్రంగా గాయపడ్డాడు. కారును బొలెరో వాహనం ఢీకొన్న తర్వాత రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.