ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ బాణసంచా తయారీ కర్మాగారంలో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడు ఘటనలో ప్రాణనష్టం సంభవించడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు.ఈ మేరకు ప్రధాని మోదీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.కాకినాడ జిల్లాలోని బాణసంచా కర్మాగారంలో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు మరియు వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయాన్ని కూడా ప్రధాని ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రధాని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa