రాష్ట్ర సంక్షేమం కోసం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన సూపర్‌సిక్స్ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్ అన్నారు. కంకిపాడు పరిధిలోని ప్రొద్దుటూరులో బుధవారం నిర్వహించిన బాబూ ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ...... రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. పెనమలూరు ఎమ్మెల్యేగా బోడె ప్రసాద్‌ను గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పావనమూర్తి, వై. ఫణి, కోటేశ్వరరావు, టి. సతీష్, స్టాలిన్, శ్రీనివాసరావు, అడపా మహేష్, సీహెచ్ రవితేజ, వి. రఘు, టి. రాజేశ్వరి, సీహెచ్ అభి తదితరులు పాల్గొన్నారు. ఫ కంకిపాడులో నిర్వహించిన బాబూ ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పులి శ్రీనివాసరావు గోగినేని వెంకటరమణ, కొండా నాగేశ్వరరావు, ఏనుగ జయప్రకాష్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa