ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రఘురామకే ఉండి సీటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 12, 2024, 03:32 PM

ఉండి కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అనంతరం అయన చేసిన కామెంట్స్‌ను బట్టి చూస్తే ఉండి అసెంబ్లీ టికెట్‌ను రఘురామకృష్ణం రాజుకే కేటాయిస్తారని క్లారిటీ వస్తోంది. ఇటీవల రఘురామ సైతం ఉండి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి ఊతమిచ్చినట్లుగా.. చంద్రబాబు కూడా సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు కార్యకర్తల సమావేశంలో క్లారిటీ ఇచ్చేశారు. అయితే, రామరాజుకు కాకుండా.. రఘురామకు టికెట్ కేటాయించడాన్ని ఆయన అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. రామరాజుకు టికెట్ ఇవ్వకపోతే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్ంయలోనే వీరిని శాంతింపజేసేందుకు చంద్రబాబు నేరుగా కలిశారు. వారికి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఒకటి రెండు రోజుల్లో రఘురామ కృష్ణం రాజు పేరును ఉండి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. మరి ఈ ప్రకటన వచ్చాక పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa