ధర్మవరం మండలం గుట్ట కింద పల్లి గ్రామానికి చెందిన ఖాదర్ భాష(55 )అను వ్యక్తి ఆదివారం తన ఇంటి వద్ద నుండి టూ వీలర్ పై కొత్తపేటకు వస్తూ ఉండగా కొత్తపేట దర్గా వద్ద ఎదురుగా ఒక టూ వీలర్ ఢీ కొట్టింది. ఖాదర్ బాషా తలకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ధర్మవరం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.