ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిను గద్దె దించలేమనే.. హత్యకు చంద్రబాబు కుట్రపన్నారని మంత్రి అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. సీఎం వైయస్ జగన్ పాలనలో చంద్రబాబు ఆటలు సాగవని పచ్చ బ్యాచ్‌కు తెలుసు. అందుకే ఇలా దాడికి ప్లాన్ చేశారని మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.... సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గారు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. విజయవాడలో రోడ్‌షో నిర్వహించే సందర్భంలో ఆయనపై గురిచూసి ఒక బలమైన రాయి వేశారు. క్యాట్‌బాల్‌తో వేశారో.. మరేదైనా పరికరం ఉపయోగించి ప్రయోగం చేశారో అర్ధం కాని పరిస్థితి. జగన్ గారి నుదిటిపైన బలమైన గాయం తగిలింది. రాష్ట్రమంతా నివ్వెరబోయింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఈ చర్య ఎందుకు జరిగింది..? అనే భావన అందరిలోనూ కలిగింది. అనేకమంది ప్రజాస్వామ్యవాదులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానులు.. ఐదేళ్లపాటు కంటికి రెప్పలా చూసుకుంటున్న ప్రజలంతా చాలా ఆందోళనతో విలపించారు. తమ ఆవేదనను వెలిబుచ్చారు అని అన్నారు.