కాంగ్రెస్ పార్టీపై రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు పేదలు, రైతుల సమస్యలు పట్టవు ఆరోపించారు. మాటలకు, చేతలకు పొంతన లేకపోవడంతో ఆ పార్టీ ప్రజలకు దూరమైందన్నారు. ప్రజల్లో పట్టు కోల్పోవడంతో దిక్కుతోచని కాంగ్రెస్ చిన్నాచితకా పార్టీలతో పొత్తులకు మొగ్గుచూపిందన్నారు. గరీబీ హఠావో నినాదంతో ప్రజల ముందుకు వచ్చే కాంగ్రెస్ వాస్తవానికి పేద ప్రజల కోసం పనిచేయదని ఆరోపించారు.