ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రభుత్వ జీతభత్యాలు పొందుతున్న 40 మంది సలహాదారులు కోడ్ పరిధిలోకి వస్తారని పేర్కొంది. నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నారని సలహాదారులపై భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. ప్రతిపక్షాలను విమర్శిస్తూ మీడియా సమావేశాలు పెడుతున్నట్లు గుర్తించిన ఈసీ.. తాజాగా సలహాదారులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.