చిట్వేలి మండలం చెర్లోపల్లి, ఎస్టీ కాలనీ, అరుంధతి వాడలలో గురువారం తిరిగి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించాలని రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు కోరారు. పార్లమెంటు సభ్యులుగా పీవీ మిథున్ రెడ్డిని, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఇంటి ఇంటికి తిరిగి అభ్యర్థించారు. కార్యక్రమంలో చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, ఎల్. వి మోహన్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, వెంకటరమణ పాల్గొన్నారు.