నారిగళంతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టాలని పెమ్మసాని చంద్రశేఖర్,గల్లా మాధవి, మాగంటి రూపా, నన్నూరి నర్సి రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం గుంటూరు లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నారి గళం పేరుతో మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి, మాగంటి రూపా, నన్నూరి నర్సి రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యి ప్రసంగించారు. వారు మాట్లాడుతూ.. నారిగళంకు ప్రతిరూపంగా నిలబడతారని భావిస్తున్నాను. చంద్రబాబు ను గెలిపించుకునే బాధ్యత మన మహిళల మీద ఉంది. జగన్ రెడ్డికి నారిగళం ఎలా ఉంటుందో ఎన్నికల్లో చూపించాలి. మనమందరం ఓటు వేయటమే కాదు, పదిమందితో ఓటు వేయించి గెలిపించే బాధ్యత మన మహిళల మీద ఉంది.
తెలుగుదేశం, జనసేన అధికారంలోకి రాగానే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. కలలకు రెక్కలు అనే పేరుతో ఓ సరికొత్త పథకాన్ని మహిళల కోసం తీసుకొచ్చారని తెలిపారు. సృ ష్టికి మూలం మహిళ అని, మహిళ అనుకుంటే ఎంతపనైనా ఏ పనైనా సాధిస్తుందని చెప్పారు. వివక్ష వేధింపులు, సాధింపులున్నా, అవకాశాలు రాకపోయినా, అవమానాలు ఎదురైనా మహిళలు వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలన్నారు.
అమరావతి మహిళా రైతులను ఎంత దారుణంగా హింసించారో యావత్ ప్రపంచం చూసి నివ్వెరపోయిందని, ఎన్ని అడ్డంకులు ఎదురయినా మొక్కవోని దీక్షతో పాదయాత్ర, దీక్ష శిబిరాలను నిర్వహించారని వారిని చూసి ప్రపంచం అండగా నిలుస్తుందని తెలిపారు
ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత, స్త్రీ సంక్షేమం గురించి కృషి చేస్తోంది తెలుగుదేశం పార్టీ. ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పిస్తూ తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మహిళా సమానత్వానికి నాంది పలికారు. అలాగే ఎన్టీఆర్ తొలిసారిగా మహిళలకు 33 అసెంబ్లీ సీట్లు, 5 మంత్రి పదవులు ఇచ్చి రాజకీయాలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచితే... నారా చంద్రబాబు నాయుడు శాసనసభకు తొలి మహిళా స్పీకరును అందించారు. ఎన్టీఆర్ మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పితే... తొలిసారిగా మహిళల కోసం 'రాష్ట్ర మహిళా కమిషన్' ను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది.
మహిళా సాధికారత కోసం భారతదేశంలోనే మొదటిసారిగా మహిళా పార్లమెంటు సదస్సు నిర్వహించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఒకప్పుడు ఇంటికీ, వంటింటికే పరిమితమైన తెలుగు మహిళను ప్రగతి బాట పట్టించి.. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములను చేయడమే కాకుండా... మహిళల ఆత్మగౌరవానికి, మహిళల సంక్షేమానికి కూడా ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిన నేత నారా చంద్రబాబు నాయుడు.ఈ కార్యక్రమంలో జనసేన మహిళా నాయకురాలు కన్నా రజిని,జ్యోత్స్నా తిరునగరి,నన్నపనేని రాజ కుమారి తదితరులు పాల్గొన్నారు.