టిప్పర్ ఢీ కొన్న ఘటనలో వ్యక్తి చేతికి తీవ్రగాయాలైన సంఘటన బుధవారం మద్యాహ్నం చోటు చేసుకుంది. యాడికి మండలంలోని చందన గ్రామానికి చెందిన రాజేశ్వరి కుమారుడు రఘు రాయల చెరువులోని ఓ వస్త్ర దుకాణం లో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం యజమాని ఇంటి నుంచి ద్విచక్ర వాహనంలో వస్త్రాల మూటను రఘు తీసుకుని బయలుదేరాడు. నగరూరు సర్కిల్లో ద్విచక్ర వాహనంలోని మూటకు టిప్పర్ తగలడంతో ఆ వ్యక్తి పల్టీలు కొట్టి టిప్పర్ చక్రాల కింద అరచెయ్యి పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa