కేంద్ర ఎన్నికల కమిషన్ ఈసారి వృద్ధులు, దివ్యాంగులకు హోం ఓటింగ్ కోసం కొత్తగా అవకాశం కల్పించింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నాం. హోం ఓటింగ్ కావలసిన వారు ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకూ ఫారం 12(డి) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 26న తుది జాబితా తయారు చేస్తాం. వచ్చే నెల 7 నుంచి 10 తేదీ వరకూ హోమం ఓటింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తాం.