రాయచోటి, ఈడిగపల్లె సమీప చిన్నచెరువులో జరిగిన కొండమర్ల ఈశ్వరయ్య హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ తులసీరామ్ తెలిపారు. సుండుపల్లె మండలం పొలిమేరపల్లె గ్రామం ఈడిగపల్లె చిన్న చెరువులో జరిగిన ఈశ్వరయ్య హత్య కేసు వివ రాలను రాయచోటి రూరల్ పోలీస్ స్టేన్‌లో సీఐ వెల్లడించారు. సుండుప ల్లె మండలం చిన్నగొల్లపల్లె పంచా యతీ పూజారివాండ్లపల్లె సమీపంలో ఈనెల 1వ తేదీ రాత్రి శ్రీచింతకోట మ్మ జాతర జరిగింది. జాతరకు సంబేపల్లె మండలం ప్రకాశ్ నగర్ కాలనీ వాసి కొండమ ర్ల ఈశ్వరయ్య వెళ్లాడు. ఈ క్రమంలో ఈడిగప ల్లె వద్ద చాందినీ బండి వద్ద డ్యాన్సులు చూ స్తున్న ఈశ్వరయ్యను గుంతరాచపల్లె వాసి బు జే రవీంద్రనాయుడు అలియాస్ రవి, ఈడిగ పల్లెకు చెందిన కమలాపురం జ్ఞానేశ్వర్ అలి యాస్ జాను రాత్రి మూడు గంటల సమ యంలో ఈడిగపల్లె పక్కనే ఉన్న చిన్నచె రువులోకి తీసుకెళ్లి బండరాళ్లతో ముఖం, తల మీద కొట్టి చంపి అని వద్ద ఉన్న రూ.38,500 డబ్బు దొంగలించుకుపోయారు. ఈ విషయం పై మృతుడు ఈశ్వరయ్య తమ్ముడు కొండమర్ల చిన్నప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయచోటి రూరల్ సీఐ తులసీరామ్, సుండుపల్లె ఎస్‌ఐ ఎస్‌కేఎం హుస్సేన్ ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని నిందితుల కోసం గాలిస్తుండగా 16వ తేదీన రాయచోటి డీఎస్పీ మహబూబ్ బాషా ఇచ్చిన సమాచారంతో నింది తులను అరెస్టు చేసినట్లు తెలి పారు. వారి నుంచి చేసి రూ.29 వేలు స్వాధీనం చేసుకుని బుధవా రం రాయచోటి కోర్టులో హాజరు పర్చగా కోర్టు నిందితులకు 14 రోజుల రిమాం డ్ విధించినట్లు రూరల్ సీఐ తెలియజేశారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని ఛేదించిన రాయచోటి రూరల్ సీఐ తులసీరామ్, సుండుపల్లె ఎస్‌ఐ ఎస్‌కేఎం హుస్సేన్‌ను డీఎస్పీ అభినందించారు.