టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్సి వర్ల రామయ్య పై విచారణ చేసి నోటీసులు ఇవ్వాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీచేసిన ఎన్నికల కమీషన్. గుంటూరులోని టిడిపి రాష్ర్ట కార్యాలయంలో ఈనెల 8 వతేదీన వర్లరామయ్య విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ముఖ్యమంత్రి జగన్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది ఎన్నికల నియమావళికి విరుధ్దం అని దీనిపై వైయస్సార్ సిపి ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది.దీనిపై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమీషన్ గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డికి ఆదేశాలు జారి చేసింది.
![]() |
![]() |