మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించింది. ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. మళ్లీ జగనే సీఎం కావాలంటూ జనం ముక్తకంఠంతో చెబుతున్నారు. బస్సు యాత్ర వైయస్ఆర్ సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతోంది. జననేత కోసం జనం మండే సూరీడును సైతం లెక్క చేయడం చేయడం లేదు. దారి పొడవునా తీన్‌మార్‌లు, డప్పుల సందడితో ఎక్కడ చూసినా అభిమానులు సందడి చేస్తున్నారు. బస్సు యాత్ర జన ప్రవాహాన్ని తలపిస్తోంది.
![]() |
![]() |