ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే అధికారి ముసుగులో కిలాడీల వేషాలు.. ఆ వైరల్ వీడియో వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే!

international |  Suryaa Desk  | Published : Fri, Dec 19, 2025, 10:54 PM

సోషల్ మీడియా పుణ్యమా అని ఈ రోజుల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడం సామాన్యులకు కత్తిమీద సాములా మారింది. తాజాగా రైల్వే టీటీఈ టికెట్ లేకుండా రైల్లో ప్రయాణిస్తున్న ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ముఖ్యంగా అందులో అతడు ఆమెను బాత్రూంలోకి తీసుకెళ్లి.. డోర్ వేసిన వీడియోపై పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. నమ్మిన వారంతా రైల్వేశాఖపై దుమ్మెత్తి పోస్తుండగా.. కొందరు నెటిజెన్లు మాత్రం ఈ వీడియో వెనుక ఉన్న భయంకరమైన కుట్రను బట్టబయలు చేస్తున్నారు. ఇది నిజమైన సంఘటన కాదని, కావాలనే రైల్వే అధికారుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు సృష్టించిన 'స్క్రిప్టెడ్' వీడియో నిరూపిస్తున్నారు.


తాజాగా వైరల్ అయిన ఈ వీడియోలో.. టికెట్ లేని యువతి వద్ద జరిమానా వసూలు చేస్తున్నట్లు నటిస్తూ, ఆమె పట్ల అమర్యాదగా ప్రవర్తించడంపై చాలా మంది ఫైర్ అయ్యారు. ఈక్రమంలోనే రైల్వేశాఖపై పెద్ద ఎత్తున మండిపడ్డారు. ఈ వీడియోను షేర్ చేస్తూ, కామెంట్లు చేస్తూ రచ్చ చేశారు. కానీ మరికొందరు మాత్రం ఈ వీడియోలో కనిపిస్తున్న టీటీఈ నకిలీ వాడని చెబుతున్నారు. అతడి పేరు రాజ్ ఠాకూర్ అని, ఇతడు గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద వీడియోలను సృష్టించాడని చెబుతున్నారు. ముఖ్యంగా ఆధారాలతో సహా బయటపెడుతున్నారు. రైల్వే అధికారుల గౌరవానికి భంగం కలిగించడమే ధ్యేయంగా.. నకిలీ ఐడీ కార్డులు, అసలైన యూనిఫాంలను ధరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రైల్వేశాఖ పరువుకు భంగం వాటిల్లేలా చేస్తున్నాడన్నారు.


ఇవన్నీ చూసిన నెటిజెన్లు.. ఈ అసాంఘిక శక్తుల ఆగడాలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భారత రైల్వే శాఖ ఈ అంశంపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇది నిజమైన వీడియోనేనా, నకిలీదా అనే సరిచూసుకుని చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఒకవేళ ఈ వీడియోలో ఉన్నది నిజమైన అధికారి అయితే.. అతడిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించి, నాన్-బైలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పేర్కొంటున్నారు. ఒకవేళ ఇది 'రాజ్ ఠాకూర్' సృష్టించిన నకిలీ వీడియో అని తేలితే.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నందుకు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు అతడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వివరించారు. ముఖ్యంగా వీడియోలో కనిపించిన యువతి సహా అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని అంటున్నారు.


ఇలాంటి వీడియోల వల్ల అధికారుల వ్యక్తిగత ప్రతిష్టనే కాకుండా, మొత్తం ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని సడలిస్తాయని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించిన అంశాల్లో ఇలాంటి తప్పుడు వీడియోలు సమాజంలో అనవసర భయాందోళనలను కలిగిస్తాయని.. వెంటనే చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు. అయితే రైల్వే శాఖ నుంచి ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్పటి వరకు ఇలాంటి అనుమానాస్పద వీడియోలను షేర్ చేయవద్దని, ఇతరులకు పంపే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa