వైసీపీ ఐదేళ్ల పాలనలో తమను, పార్టీ శ్రేణులను అక్రమ కేసులు బనాయించి వేధించారని టీడీపీ ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు నారా భువనేశ్వరి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే అక్రమ కేసులను ఎత్తివేయాలని, తమ బిడ్డల భవిష్యత్తును బాగు చేయాలని కోరారు. జగనన్న రీ సర్వే పేరుతో అనేకమంది అమాయకుల భూములను వైసీపీ నేతలు లాక్కున్నారని, ఈ సర్వేను రద్దు చేయాలని కోరారు. కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ పాఠశాలను ఏర్పాటు చేస్తే కార్యకర్తల పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆకాంక్షించారు. భువనేశ్వరి వారికి సమాధానం ఇస్తూ పార్టీ శ్రేణులు కోరుకుంటున్న అన్ని సమస్యలకు పరిష్కారాలు తప్పకుండా లభిస్తాయని హామీ ఇచ్చారు.
![]() |
![]() |