రాష్ట్రంలో ఎండలు మండిపోతుండడంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. శని, ఆదివారాల్లో రికార్డు స్థాయిలో 250 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. బహిరంగ మార్కెట్లో రూ.27 కోట్లను చెల్లించి 36.155 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను డిస్కమ్‌లు కొనుగోలు చేశాయి. స్వాప్‌లో మరో 4.9 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పొందాయి. ఇంకోవైపు.. జెన్కో విద్యుత్కేంద్రాల్లోని బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి. వీటీపీఎ్‌సలో 2.30 రోజులు, ఆర్‌టీపీపీలో 3.55 రోజులు, కృష్ణపట్నంలో 4.30 రోజులు, హిందూజాలో 1.75 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. సెయిల్‌లో మాత్రం 14.64 రోజులకు అవసరమైన బొగ్గు నిల్వలున్నాయి.