జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మంగళవారం ఉదయం 9:30 గంటలకు భారీ ర్యాలీలో పవన్ నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. గొల్లప్రోలు పట్టణ ప్రవేశం నుంచి పాదగయ క్షేత్రం వరకు పవన్ కళ్యాణ్ ర్యాలీ సాగనుంది. అనంతరం పిఠాపురం ఎంపీడీఓ కార్యాలయంలో పవన్ నామినేషన్ వేయనున్నారు.