ప్రపంచంలోని ఏ నాగరిక దేశం కూడా మతాన్ని పౌరసత్వానికి ప్రాతిపదికగా మార్చలేదని కేరళ సీఎం పినరయి విజయన్ సోమవారం అన్నారు. మట్టన్నూర్‌లో జరిగిన ఎన్నికల సభలో విజయన్ ప్రసంగించారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA) దేశంలోని లౌకిక విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు కేవలం నాలుగు రోజుల సమయం ఉందన్నారు. మత ప్రాతిపదికన రాజకీయాలు చేసే బీజేపీకి ఓటర్లు సరైన గుణపాఠం నేర్పాలన్నారు.