దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలకు మూడు రోజుల పాటు తీవ్రమైన వడగాలుల హెచ్చరికను భారత వాతావరణ శాఖ జారీ చేసింది. ఏపీ, తెలంగాణలోనూ ఎండల తీవ్రత పెరిగిందని, మరో మూడు రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది. డీహైడ్రేషన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa