శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు సోమవారం దర్శించుకున్నారు. అనంతరం, అతిథి గృహంలో శ్రీశైలం, రాయదుర్గం, బనగానపల్లె, కదిరి అభ్యర్థులు బుడ్డా రాజశేఖరరెడ్డి, కాలువ శ్రీనివాసులు, బీసీ జనార్దన్‌రెడ్డి, కందికుంట ప్రసాద్‌కు చంద్రబాబు బీ-ఫాంలు అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... జగన్ అహంకారానికి సైకోయిజం కూడా తోడైంది. అసలు తనేం చేస్తాడో అతడికే తెలియదు. రాయితో మనల్ని కొడతాడు. చెల్లెల్ని కొడతాడు. చివరకు అదే రాయితో తనను తాను కొట్టుకుంటాడు.దోపిడీదారులు ఇళ్లలోకి వస్తే ఏం చేస్తాం.. చేతికి ఏది దొరికితే అది పట్టుకుని తరిమికొడతాం. అలాగే బందిపోటు దొంగ జగన్‌ను కూడా తరిమికొట్టి రాష్ట్రాన్ని అంతా కలిసి కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు.